యల్లనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..
యల్లనూరు పోలిస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
(యల్లనూరు జనచైతన్య న్యూస్)
యల్లనూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఇందులో భాగంగా సిఐ సుబ్రహ్మణ్యం తో కలిసి పోలిస్ స్టేషన్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ గ్రామాలలో ఫ్యాక్షన్ కు తావు లేకుండా చూడాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామాలలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని వారి పై బైండోవర్ కేసు నమోదు చేయాలని పుట్లూరు సిఐ సుబ్రహ్మణ్యం తో తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు ఎస్సై హేమాద్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.